కళ్ళ జోడు
తేది: 20-01-2024…
శీర్షిక : చూపుకు తోడు.
మూల పురుషుల పేరు వివరం
పెద్దరికం జాడలు తెలియకున్నా
పెద్దన్న పాత్రలలో ఒదిగిపోతూ
సుద్దుల గంప తలకెత్తుకుంటున్నది...
యువతకు చేదోడు వాదోడుగా నిలిచి
భవిత కోసం… కదర్నాకు పోజులు కొడుతూ
కాలుమీద కాలేసుకుని
ముక్కుమీద
మోపుపెట్టి
కాలరెగరేసుకుంటున్నది ...
కొంతమందికి నడివయసు వచ్చేసరికి
చదవలేక చతికిల బడుతుంటే
సమీపములో చూపుకు అండదండై
సమున్నత సాయం చేస్తుంది. ...
మరికొంత మంది విషయంలో…
మూడవ కాలు మొలుచుకొచ్చే సరికి
మురిపాలను మూటగట్టుకుని…
ముక్కు మీద వేలాడుతూ తెగ ఫోజులు
కొడుతూ.. అంతా
నేనే సుమా అంటుంది....
అరవై శాతం మందికి ఆయుధమై
కొంతమందికి ఉపాధియై..మొత్తానికి
మానవ జాతికి సేవలందిస్తూ
రక రకాల
రంగుల్లో ఆకారాల్లో మురిసి
పోతున్నది
చూపుకు తోడుగా ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment