Saturday, June 22, 2024

కార్టూన్ తేది : 23-01-2024 శీర్షిక : మనోల్లాసం

 కార్టూన్ 

తేది : 23-01-2024
శీర్షిక : మనోల్లాసం 

భళ్ళున నవ్వుల పూలు 
పూయించే నజరానా .... 
బడా బడా చిత్రకారుల 
చేతుల్లో మెలికలు తిరిగి .... 

పిల్లి కళ్ళు మూసుకుని 
పాలు తాగుతూ ....ఏహే 
లోకం నన్ను చూడటం లేదులే ... 
చూసినా ఎవరి పనులు వారికని 
అపోహల కల్లంలో తూర్పార 
పట్టుకోవడమే ... 

గల్లీలో ఉంటే పట్టించుకోరెవ్వరు. 
ఢిల్లీలో ఉండి... కాదంటేనే లొల్లి ... 
దేశదిమ్మరిలా కాళ్లరిగేలా తిరిగి 
భజనలు చేయించుకుంటేనే.... 

అర్థం కాని శుంఠలకు కూడా 
అర్థమయ్యేట్టు అభినయిస్తూ ... 
అబ్బే అదేమి లేదు ... జలుబు 
చేసిందనే జవాబులే ... చకితం ... 

అయినా నవరసాల నాణ్యతలు 
పడిపోకుండా ... పట్టుకుని 
వేలాడుతూ ... మనందరి 
మనోల్లాసాలకు ఊతమైన వారిని 
మననం చేసుకోవడం సబబే.... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment