పురి విప్పిన ఊపిరి
తేది: 02-11-2023
శీర్షిక : విహంగమే..
అనుకున్నవి చేరువవుతే
పులకించదా అణువణువు ..
ఉరకలేయదా ఆనందం
ఉప్పొంగదా తనువంతా ...
సప్త వర్ణాల మెరుపులతో
సజలమవ్వవా నయనాలు ...
వేల తరంగాలు వేణువుగా
మీటి విందవ్వదా వీనులకు ...
వయ్యారాల సయ్యాటలతో
వణికిన
మేనంతా జల్లుమని
వెన్నుపాములో వేల ఓల్టేజిల
విద్యుత్ ప్రసరణల విహంగమేగా…
ఈలపాట రాగాలు ఇంపుగా
ఇనుమడించి హుషారెక్కవా ...
నాట్యమెరుగని పాదాలు సైతం
నయాగార జలపాతమై అడుగులేయవా..
మైమరచిన మయూరమై
ఉల్లమంతా ఊయలూగదా…
వయసు తగ్గిపోయి యువరక్తం
వంపుకుని సంతోషాల చిరునామవదా…
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment