Saturday, June 22, 2024

కన్నవారి కలలు తేది28-12-23 శీర్షిక -ఉన్నతంగా ఎదగాలని

 కన్నవారి కలలు 

తేది28-12-23
శీర్షిక -ఉన్నతంగా ఎదగాలని 

సమాచారాల లేములు..సౌకర్యాల 
అష్ట కష్టాలు..  అపరిపక్వతల 
అవగాహనలు …ముప్పేట దాడులతో 
మురిపమైన తీరని కోరికల సమాహారాలను
దాటుకుని వడివడిగా నడకలు సాగిస్తూ …

కోటి ఆశల తోటలో నిలిచిన వారి పిల్లలను
మెట్టు తదుపరి మెట్టులా మలుచుకుని
వారికన్నా ఉన్నతంగా ఎదగాలని 
విలువల సంఘంలో రత్నమై మెరవాలని 
నలుగురిలో తలెత్తుకుని  నిలవాలని… 

గుండెలు నిండిన ఆశల తోటలు
గుభాళించాలని కోటి కోరికల మూటలు
ఎన్నో ఎనెన్నో అన్నీ మూటగట్టుకుని 
 మేలిమైన వాటిని తోడిచ్చి…
 ఏలికలుగా చూడాలనే కోరికలు ...

పిల్లలకు కూడా ఇష్టమయితే 
తీరడం కష్టమేమి కాదు ... కానీ
ఇష్టంలేకపోతే మాత్రం గాలి వానకు 
 కూలిపోయే గడ్డి గుడిశెలే సుమా .. 

అయినా అమ్మానాన్నలు ఎప్పుడూ
స్వార్థపు  సరంగులు కానేకారు… 
పుట్టెడు దీవెనలుచ్చి తమ ఆయుశ్శు
కూడ పంచి ఇలవేల్పులా చూసుకుంటారు… 

పెరటితోట వాళ్ళకు కాకపోయినా 
నలుగురుకి ఉపయోగపడినా 
ఆనందపడిపోయి… ఆ ముచ్చటకు
కూడ గర్వపడి పోతుంటారు…. 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment