చిత్ర కవిత
తేది 13-11-23
శీర్షిక- విశ్వదూత...
మానవాళి పుట్టుకే మహోన్నతం..
పుట్టుకల మూలం దైవత్వం…
ఆద్యంతం తోడునీడై తానుండలేక
తానులో ముక్కగా తనరూపం పదిలపరిచె…
ఉదయాతపూర్వమే వెలుగుబాటల
నక్షత్రమై.. కళ్ళాపి వాకిళ్ళ కనకమహాలక్ష్మిగా
సప్తవర్ణ శోభలతో సంస్కరించి..
ద్వారబంధనమునపచ్చని తోరణమై
కనుపాపలో
ప్రేమలు నింపుకున్న కరుణామూర్తి...
జీవరాశికి తరువు సేవలలా
సమయానుకూలమై ఇంటిల్లిపాదినీ
సవరించుతూ .. పిల్లలకు ప్రేమగా
పెద్దలకు బాధ్యతగా పరిపరి సేవలు
పంచే ప్రేమమూర్తి ...
సదా కుటుంబ ఉన్నతికై
సన్నుతిస్తూ… అడుగడుగున
ఆపదలకు మంత్రివరిలా అమ్మగా
ఆలిగా చెల్లిగా
ఆవరించిన ఆదర్శమూర్తి ...
వినీలాకాశ పందిరి నీడలో విరించి
మరచిన నిశి చీకటి తెరలను పారద్రోల
విజ్ఞాన దీపాలను వెలిగిస్తూ
విశ్వక్షేమాల
విన్నపాలతో విరామమెరుగని విశ్వదూతగా
విరాజిల్లు...
కరినగరము.
No comments:
Post a Comment