Saturday, June 22, 2024

ఇంటర్వూ తేది : 18-01-2024 శీర్షిక : ముఖాముఖి.

 ఇంటర్వూ 

తేది : 18-01-2024
శీర్షిక : ముఖాముఖి. 

ఎదురెదురుగా కూర్చుని 
ముఖాముఖిలో ముచ్చట గొలిపి
అర్హతల వాలకాన్ని అంచనా 
వేయడానికో ఆసరా కొలమానం...

పాటమెంత గొప్పగా చదివామన్నది 
కానే కాదు ... పరీక్షలో ప్రశ్నకు సరైన 
జవాబివ్వడమే... అసలు సిసలైన 
చదువుల కొలతల చక్కిలిగింత ... 

అడుగడుగున ఎదురయ్యే 
ఆశల పల్లకి ...ప్రయత్నాల 
పట్టుదలలే ఫలితాల బండిని 
ఎక్కించి ఊరేగిస్తుంది.... 

సీరియస్సుల చింత బరిగెలు 
నిమిషాలలో తేల్చి విరిగి కుప్పకూలాయి..
ఇప్పుడంతా ఆన్లైన్లోనే అప్పగింతలు.. 
వీడియోలలోనే జోడింపులు … 

అక్కెరకొచ్చే ఒక్క విషయం కొరకు 
 అక్కర రాని కోకొల్లల విషయాలు 
 అవపోశన పట్టినా... ఉత్తరాలో 
 దక్షిణలో మధ్యలో దూరిపోయి 
మతలబులు చేసి మసిపూసి మారేడు 
కాయలు సమర్పి చుకునేవారు... 
 లేదంటే తెర చాటు బలాబలాలు 
 తెరమీదకెక్కి తైతక్కలాడేవి... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment