Sunday, June 16, 2024

జానపదం. తేది: 25-11-23 శీర్షిక : ఓటు విలువ

 జానపదం. 

తేది: 25-11-23
శీర్షిక : 


శీర్షిక: ఓటువేయ తరలిరండి… 

కదలిరండి కదలిరండి 
భారతీయ బంధువులారా 
ఓటేయక మిన్నకుండి
ఓటువేయ ఇల్లు కదలండి… 

యుగాలనాటి మాటైనా 
జగాన తేజమదే సుమా 
ధర్మో రక్షతి రక్షితః అన్నది
దరిచేర్చే మూల సూత్రమిదే ... 

ఆస్తులను పోగేతలతోనే
అలసి మునకలేయద్దు 
అప్పుడప్పుడవి కాచుకునే     
ఆలోచనలు  చేయండి .... 

అలసత్వము వీడండి
ఓటు విలువ తెలియండి
బాధ్యతలను పాటించి
భద్రతను ఆస్వాదించండి… 

నిర్వర్తన  కర్తవ్యాలు 
నిష్ఠలతో చేయండి .... 
మానండి పరనిందలు… 
మరచిపొండి కులకక్షలు ... 

సలక్షణమై నిలిచెకదా 
శ్వేతములో సప్తవర్ణం 
భిన్నత్వంలో ఏకత్వం 
నిబిడీకృతమని గుర్తించు ... 

ఐదువేళ్ళు ఒకటైతేనే 
అందించును ముద్దనోట 
నిర్మాణాత్మక లోచనల 
చేరుకోండి లక్ష్య సిద్దులు....   

మనధర్మం గెలవాలంటే
మంచి మాట వినరండి .... 
మనసంస్కృతి సన్నుతించ 
కలిసినడక  నేర్చుకొండి .... 

మనస్సాక్షి నమ్ముకోండి 
మనగెలుపును కోరుకొండి
మనఖర్మమని చింతించక
మంచిని చెవికెక్కించండి… 

దక్షతగల నాయకులు 
దాపుననే వేచున్నారు ..   
దండిగ పాలించేందుకు 
దన్నుగా  నిలిచేందుకు….

వర్తమానం వర్ధిల్లాలంటే 
వరుసవిజయం చేకూర్చండి 
భవిష్యత్తుల భరోసా కోసం
భారములని తలవకండి….   

అవలోకన చేయండి 
అంతరాత్మ కదిలించండి .... 
తరాలెన్నో తరిస్తుంటే 
తన్మయత్వం చెందండి… 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment