:సుపరిపాలన
తేది : 02-06-2023
శీర్షిక : ఉత్తమ నాయకత్వం
రాజుల రోజులు పోయి రాజ్యాలు మారినా
రోజు కూలీల బతుకులు మారలేదు ....
ప్రజాస్వామ్యం పేరు చెప్పి పాలనలు వచ్చినా
పేదోడి బ్రతుకు చిత్రం మారలేదు ....
చరిత్రలను అనుభవాలుగా
మలుచుకుని .... తప్పులు
దొర్లని వర్తమానాలతో కదిలి ...
ముప్పులు ముందే పసిగట్టగలిగే
భవిష్యత్తు నిర్ణయాల చాతుర్యం .....
అనుభవాల శూన్యతలో
అందుబాట్ల లేములలో
తటపటాయింపుల తక్కెడ
కాకుండా....నిఖార్సైన
నైపుణ్యాల ప్రదర్శన ......
స్వార్థాల సంచులు లేకుండా
బంధుప్రీతుల రాబందు కాకుండా
ఉత్తర దక్షిణాల ఉనికి లేని
స్వచ్చమైన సంయమనశీలి .....
అంధులు కూడా అనుసరించే
బ్రెయిలీ లాగా .... న్యాయదేవత
కళ్ళు మూసుకున్నా .... నడక
మాత్రం సాఫీగా సాగే న్యాయ మార్గం ....
ధర్మం ఒంటరిదైనదని
దాటేయకుండా .... యుగాలు
మారినా జగాన తేజమైన
రామరాజ్యంలా ఘన ఉదాహరణమై
సాగాలి ... ఈ కలియుగంలో సైతం ....
వజ్రోత్సవాల వాకిట నిలిచినా
తీరు మారని తిప్పల్లేనాయే ....
నందిలా నాలుగు రోజులైనా చాలు
శాస్త్రిలాగ మురార్జీ లాగ వాజ్ పేయి లాగ
మంచికింకా మరణం రాలేదంటూ
ఋజుమార్గమున నిలిచిన
ధ్రువుడై ... రాబోవు తరాలకు
ఉదాహరింపబడాలి ...
ఉత్తమమైన అమ్మ గమ్యానికి
ఉదాత్తమైన తన గమనం జోడించిన
సంద్రపు అలల సంయమనశీలి
ఛత్రపతి శివాజీలా ...
మొత్తంగా ఉత్తముడై నిలవాలి ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment