Saturday, June 15, 2024

కానరాని కారుణ్యం తేది : 17-11-2023 శీర్షిక : మానవత్వాలు అంటుకట్టాలి.

 కానరాని కారుణ్యం 

తేది : 17-11-2023
శీర్షిక : మానవత్వాలు అంటుకట్టాలి. 

 ఆత్మీయ లతల సుగంధాలు
 అనురాగ కుసుమ పరిమళాలు 
 అనుబంధాల తీగల అరమరికలు
 ఎందుకో బీడు పడిపోతున్నవి ...

అవిభాజ్యమై భాసిల్లిన కుటుంబాలు.. 
అన్యోతలో ఓలలాడిన దాంపత్యాలు 
అనురాగములో శ్వాసించిన తోబుట్టువులు 
ఏలనో ఎవరికివారై యమునాతీరే ఈనాడు...

పూర్వీకుల మాటల పుణ్యతీర్థంలా
ఇంటికి గొడ్డొచ్చిన… బిడ్డొచ్చిన వేళా విశేషంలా
పారిశ్రామికీకతల పరుగుల జీవితమో… 
సాంకేతికతల సారూప్యమై పలకరించిన
దుష్టగ్రహమైన దూరవాణి వల్లనో… 
శనిగ్రహమైన చరవాణివల్లనో… 

వలసపాలనల దృష్టిదోషమో… 
పొరుగింటి పుల్లకూరలో… 
మర్మమైన మార్పుల జాబితాలో… 
విలవిలలాడుతున్నవి వింతజబ్బుతో…

కుండెడు తేనెలో నీటిచుక్కలా
సామూహిక సంభాషణల కళశంలో
కాలకూట విషం కలిసిన చందమై
కకావికలమై కొట్టుకుంటున్నది…. 

ఉద్దరింపులకు ఎదురుచూడకుండా… 
సద్దిముల్లెలా సర్దడానుకి నడుంబిగించాలి… 
మానవాళి మనుగడలకే శ్వాసలైన 
కళ్యాణాలకు కదం కలపాలి… 
మానవీయ విలువలకు అంటుగట్టే 
చొరవలు తీసుకుని ఆలంబనగా బతకాలి…. 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment