Saturday, June 15, 2024

బాలల దినోత్సవం తేది: 14-11-2023 శీర్షిక : ఒక్కటిగా నిలిచాం

 బాలల దినోత్సవం 

తేది: 14-11-2023
శీర్షిక : ఒక్కటిగా నిలిచాం 

 నోరులేని పక్షులే కదాని తీసిపారేస్తూ
 తీపి చుక్కల మందులు వేసి 
 ఎదురుపడి  ప్రశ్నిచకుండా 
 ఏండ్ల తరబడి పాలిస్తున్నాము...

కమ్మనైన అమ్మతనమంటూనే 
కాకమ్మ కబుర్లతో కాలం వెల్లదీస్తూ
కట్టుదిట్టాలను గాలికొదిలేసి సాధారణ 
ప్రసవాలను సైతం శస్త్రచికిత్సలతో
ముడివేసే కాసుల స్వార్థమయం...

వజోత్సవాల వాకిటనిలిచి వరుస 
దేబిరింపులే టీవీల్లో పిల్లల పౌష్టికాహారాలకని, ... 
ఆరోగ్యాలకు ఆపన్నమంటూ ప్రకటనలు 
హోరెత్తుస్తూ విద్యకు కూడా చేదోడుగారమ్మంటూ…
 నిస్సిగ్గులే...

అక్షరాస్యత అందరికి అందుబాటై 
ప్రశ్నించే గొంతులు ఎక్కడ పెరుగుతాయోనని 
 రందితో గొందిలో పానమున్నంత 
 వరకు ప్రభుత్వబడులు బాగుచేయొద్దని 
 కట్టుబాటుగా ఒట్టేసుకున్న పాలకులు ...

ఆట స్థలాలకు ముఖం వాచిపోయే 
కార్పొరేట్ కల్చరుకు కండువాలు పరిచి 
అంకురమేస్తూ …బంగారు బాల్యపు 
 ఆనందాలకు ఉరి బిగిస్తున్నారు... 

చదువులో నిత్య పోటీలే నిలుపు శ్వాసలని 
కొలుపుల పూజలు చేయిస్తూ..జీవిత్తమంటే 
మార్కులేనని…తీపిలేని చెరుకుగడలను 
తిప్పలుపడి పిండి పిప్పిచేస్తూ ఆత్మీయతల 
ఆనవాళ్లను అనురాగాల సుధలను దూరం చేస్తున్నాము… 

ఒక్కటంటే ఒక్కటి నిలబెట్టిన చట్టాలను 
తీసుకొని రాకుండా నిక్కచ్చిగా అధికారపక్షం 
ప్రతిపక్షం అంతా ఒక్కమాటగా సాగుతూ ఒక్కటై
అన్నీ ఆ తానులోని గుడ్డముక్కలమే అని 
నిరూపించుకుంటున్నాము ... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment