Saturday, June 22, 2024

డైరీలో ఒక రోజు / డైరీ తేది 24-01-2024 శీర్షిక : బతుకు ప్రతిబింబం

 డైరీలో ఒక రోజు / డైరీ 

తేది 24-01-2024
శీర్షిక : బతుకు ప్రతిబింబం 

కాలంతో పోటీపడి కలబడే 
క్రమంలో ... కలం చేసే హలం పని .... 
ప్రణాళికల పర్వము ... 
ఫలితాల పర్వము కలగలసిన 
తోవ ... 

ఇంటిలక్షణం పందిరి తెలిపిన 
విధంగా... మనిషి ప్రతిబింబం ... 
ప్రగతికి పనిముట్టు ...జ్ఞాపకాల 
కనికట్టు ...గమ్యాల సూచిక ... 

అనవసర ఒత్తిడుల భరతం 
పట్టి ... అసలైన సమాచార 
విశ్లేషణలకు ... వివేకాలకు 
వింతగా మూలమై... విజయ 
తీరం చూపిస్తుంది.... 

భావ సృజనలకు బాధ్యత 
తీసుకుని ...బతుకు మార్గం 
దర్షింపజేసి ...కళలకు కూడా 
వేదికవుతుంది .... 

అనుభవాల లోతులలో 
వంశవృక్షాల మననం ... 
చరిత్రల కోణం ... భాష 
పరిమళం ...ఆనందాల 
ఆరబోత ... బాధల బందీలు .. 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment