చర్చ వాదం
తేది : 04-12-2023
శీర్షిక : పోలికలతో బేధం
ధ్వనింపు ఏకార్ధమును బోలు
తరించు విపులమై విశదీకరించిన …
తరిచి చూడ వాని జాడలు వేరని
నిరూపణలనేకము నిక్కముగా ...
ఆరోగ్యమైన అర్థ వివరణలతో
జ్ఞాన విజ్ఞాన సంపదలనొసగుచు
జనమందరిని మేల్కొలుపంగ
జనియించె పదమై జనరంజకముగ..చర్చ…
రచ్చలు చేయు రమ్యమై దూరదర్శనములో
దూరి పాలకుల నాయకుల ప్రతినిధులు
కర్ర విరగక పాము చావక కడతేర్చు
ఎన్నో విషయాలపై గంటలు రోజులు …
చీల్చి చెండాడుకుని చిరునవ్వుల
పలకరింపులతో పగలబడెదరు ఆనక…
ఎందుకొచ్చిన తంటాయని మిన్నకుండిన
ఆరోగ్యముల మేలు అరయపొందవచ్చు…
బేధములనెత్తి చూపు వాదములనేకం..
ఒంటెత్తుపోకడలతో మింటికెగసే
పిడివాదములు గూడ కనవచ్చు మనం…
కాముక తెలియరే కలిసిచూపు బేధం…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment