Saturday, June 22, 2024

సప్త వర్ణ శోభితం తేది 19-12-23 శీర్షిక : ధన్య జీవివే…

 సప్త వర్ణ శోభితం 

తేది 19-12-23
శీర్షిక : ధన్య జీవివే… 

ఆశలెరుగని వికారాకారం 
ఆశయమెరుగని భావి జీవితం 
వింత జగతిలో విడ్డూరం
అయినా ఆగని పోరాటం 
ఆకులలములే ఆహారం… 

చెట్టు చేమలే  చుట్టాలు 
పట్టుపట్టిన దాఖలాలు 
పట్టుబట్టల్లో ఒదిగిపోయిన
బుట్టబొమ్మలా ఫలదీకరణం… 
రంగుల ఆకుచిలకగా అవతారం… 

ఇంద్రధనుస్సు రంగులను
ఇగురంగా పులుముకున్నావు… 
కన్ను దెరువని విశ్వం కోసం 
కమ్మని కలలను పంచావు… 

చిన్నా పెద్దలను అలరిస్తూ
చిరాయువుగా నిలుస్తావు… 
అందాలన్నీ ఆరబోసుకుని
ఆరిందలా కులుకుతావు… 

మకరందపు జాడలను 
గమ్మత్తుగ గుర్తిస్తావు… 
కుసుమకోమలాలను 
రెక్కల్లో పొదువుకుంటావు… 

ఆరబోసిన అందాలతో
ఆడవారికి పోలికలై… 
కవివరేణ్యులకు కవితవై
వీణాపాణికి సమర్పించుకుంటావు… 
ధన్య జీవివే సుఖాంతం… 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment