ఆనందం అలుగులు పారిన వేళ
తేది 04-12-2023
శీర్షిక : గెలుపు శిఖరాలు
మనసున నాటుకున్న అంకురం
మంచి మొక్కై కొమ్మలు రెమ్మలు
వేస్తూ
కుసుమ ఫలాలతో నిండుగా..సుగంధ
సుమలతల తీగలు అల్లుకున్నప్పుడు ...
మహనీయతలు పుణికి పుచ్చుకున్న
మహర్షి..మానవత్వాలను నెత్తికెత్తుకున్న
మూర్తిమత్వం… తనంత తానే ఎదురై
ఆశించని కోరికలకు పట్టం కట్టినప్పుడు…
తొలకరితో మురిసిన అవని మాత
తోబుట్టువును చేసుకుని చేరదీసే హాలికినికి
తడిసి ముద్దై వద్దన్నా పసిడి పంటలకు సమయానుకూలమై సరిజోడయ్యే కాలానికి….
జీవిత కాలపు లెక్కకు సరిపోయే
ప్రజారంజకమైన పాలనలందించిన
ప్రభువులు..యుగాలు దాటినా జగాన
తేజమై వర్ధిల్లుతున్న రామరాజ్యపు శ్వాసల
ఒక్కసారైనా నిలిచిన ప్రతిచోటా గెలుపు శిఖరం
పలకరింపులు...గెలిచిన ప్రతి
మలుపులో అభినందనలతో జంట
కట్టిన అదనపు బాధ్యతల ఎదుగుదలలు…
ఎదిగి తరువులా ఒదిగి నిలవగలగడం ...
మనసెరిగి మసులుకునే సహచరి…
ఆలోచనలనే ఆజ్ఞలుగా పాటించే సంతానం ...
సమయానుకూలంగా సంబరాలు పంచిన
ప్రతీ ఆనందాల నందనాలు…..
నగునూరి రాజన్న
No comments:
Post a Comment