నిత్య నూతనం.
తేది : 18-01-2024
శీర్షిక : సనాతనం
సమతలమే దృష్టికి...సగం కూడా
తెలియని సముద్రపు లోతులు...
చేతికి అందినట్టే ఉన్నా ..అసలు
అర్థం కాని ఆకాశం ఎత్తులు ...
వేల సంవత్సరాల వేదాలు
వందల సంవత్సరాల ఉపనిషత్తులు
లెక్కలేనన్ని పురాణ గాథలు
లెక్కకు మించిన కావ్యాలు....
పక్కాగా బోధించదగ్గ భగవద్గీత ....
అంతా తెలుసన్న అహం తొంగి
చూస్తుంటే ...అహర్నిశలు అన్న
పానీయాల వేటలో నిమగ్నమై
బాధ్యతల చట్రంలో బందీలమై
ఆచమనం కూడా చేయలేని అభాగ్యులం ...
జీవితమంతా చిందరవందరల తీరికలేని
ఉరుకుల నడకలే....పారిశ్రామికీకత
పరుగులు నేర్పిస్తే...సాంకేతికత
పలకరింపులే మరిపించింది ....
కదలని కర్రను చెద ముట్టినట్టు
పాలల్లో పనికొచ్చే నెయ్యి దాగుందని
తెలియని విధంగా… అంతిమ దశకు
ఆధ్యాత్మికత తొలిమెట్టని నేర్వని బుద్ధికి
సనాతనమెప్పుడు నిత్యనూతనమే ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment