టీ
తేది : 15-12-2023
శీర్షిక : తెల్లోడి మాయ
తెల్లోడి మాయలతోనే
తెల్లారుతుంది నేడు ...
కాఫీయో ఛాయా లేనిదే
కదలదు బండి ఈనాడు ...
కాఫీకి కొద్దిమంది మద్దతే…
ఘుమఘుమల ఛాయ
మాధుర్యాల మర్యాదలు
కడుపులో పడితేనే
మిగతా ఏ పనులైనా ....
చిక్కని పాలతో పెడితేనే
కమ్మని టీ తయ్యారు ...
లేదంటే మనసంతా
ఆ రోజుకు ఉస్సూరు ....
టాటా వారి నంబరు వన్
అయినా…
చక్రావారి గోల్డయినా
త్రీ రోజెస్ వారి
రంగురుచి వాసనలైనా… రూబీ వారిదైనా…
జెమినీ వారి కమ్మనిదైనా….
చిన్నా పెద్ద సందర్భం
మిత్రుడొచ్చినా ...మర్యాదలకు
పుత్రుడొచ్చినా ....ఆత్మీయతలకు
కావాల్సిందే ఓ కప్పు .... ఛాయ
ఉరుకుల పరుగుల జీవితాలకు
ఈనాడు పెద్ద దిక్కైంది
అతిథి మర్యాదల్లో అగ్రగామిగా
వచ్చిన వారికి ఇచ్చుకోను ....
అతి సర్వత్రా వర్జయేత్ లాగ
మితి మీరితే ... మాత్రం
మించి పోవు అనారోగ్యాలు
తస్మాత్ జాగ్రత్త ... పారాహుషార్ .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment