చిత్ర కవిత
తేదీ 26-01-2024
శీర్షిక : స్వాతి ముత్యం ...
ఆల్చిప్పలో దాగిన స్వాతి ముత్యంలా
అంత బిగువేల చెలియా ...
అరమరికలు పారద్రోలి
ఆ దాచుకున్న ఊసులేవో సెలవీయరాదా ... ?
అల్లన వీచే చల్లగాలికి
నల్లని కురులు వీవెనలవ్వగా
ఒళ్లును తడిమి సడి చేసి
గుండెలో గుబులు పెంచెనా ?
మననమే కుంగదీసెనా...
మదిలో మెదిలే ఆలోచనల
తరంగం స్థిరమీయక చింతనలు
చేరి చిగురుటాకును చేసెనా ... ?
దీర్ఘ విచార వదనములో కూడా
వింత చూపుల భావం సుందరమైనా
విరిబోణిల మనమును చదువంగా
వివశమే పురుష పుంగవులకు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment