నిరీక్షణ ముగిసింది
తేది : 31-01-2024
శీర్షిక : అసలైన నిరీక్షణ
అదృష్టాన్ని పరీక్షించుకుందామని
ఆటలో దిగినాక కానీ అర్థం కాలేదు
లోతు తెలియని సంద్రమని ...
లోగుట్టు ఎరుగని మానసములని ....
ఏమైతేనేమి ...విలక్షణమైన
ప్రజాప్రభుత్వములో పదవిని
ఆశించి పందేరంలో నిలిచినందుకు
మొదటి అంకమే మొట్టికాయ కొట్టింది ....
నగారా మోగంగానే అభ్యర్తిగా
గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి ....
ప్రణాళికల పర్వానికి తెరలు
తీసి...పైకం కూడబెట్టగలిగా ....
బ్యాగులను చూస్తే గాని భద్రంగా
బి ఫార్మ్ వాకిలి తెరుచుకోలేదు....
పదుల మందిని నమ్మి పంపకాలు
చేపట్టినా... వాటాలలో అసలు తోటకు
నీళ్ళెన్ని మళ్ళించారో ఏమో ....పచ్చని
పొలమై పంటలు ఎప్పుడు పండాలో ...
ఇన్సూరెన్సు కంపెనీ గుర్తుల్లా
జనమంతా వేళ్ళమీద ముద్రలయితే
వేయించుకున్నారు ...ఇపుడు నా
బ్రతుకు భద్రమైనది పెట్టెలలో ...
ఫలితాల నిరీక్షణలు ఎప్పుడు
ముగుస్తాయో ఏమో ....
అడుగడుగున వివిధ అంకాలలో
నిరీక్షణలన్నీ సవ్యంగానే ముగిసినా
అసలైన నిరీక్షణ ముగింపు
ఫలితం తేలితే గాని అసలు ఆటకు
శుభం కార్డులా ముగింపు పలకదు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment