Sunday, June 23, 2024

ప్రజాస్వామ్యం - ఓటు తేది : 25-01-2024 శీర్షిక : పాశుపతాస్త్రం ...

  ప్రజాస్వామ్యం - ఓటు

తేది : 25-01-2024
శీర్షిక : పాశుపతాస్త్రం ... 

ప్రజాస్వామ్యమంటే  ప్రజల చేత 
ప్రజల కొరకు ప్రజలే నాయకులు ... 
పాలకులు ...సమ సమాజ స్థాపనకు 
నాందిగా నడుం బిగించిన సంఘము ... 

పాశుపతాస్త్రం లాంటి ఓటు ఆయుధం 
ప్రజల చేతికిచ్చె మన రాజ్యాంగం ... 
నిరక్షరాస్యతలు కొంత నీరు కార్చినా 
మలినమంటని మణిరత్నమే .... 

స్వార్థ రాజకీయాలు కొంత రచ్చ 
చేసినా ... యుగపురుషుల్లాంటి 
నిస్వార్ధం  చేతుల్లో అప్పుడప్పుడు 
నిప్పుల కుంపటి కడుగ బడుతున్నది... 

వందలు వేలు పంచుతున్నారంటే 
లక్షల కోట్లకు లగాయించుతున్నారని 
జనం గుర్తించిన రోజుననే ...దేశం 
బట్ట కట్టి బజారులో తలెత్తుకుంటుంది .... 

అమ్ముడు పోకుండా ... అమ్మ 
దేశమాత నిజ సంక్షేమం గుర్తిస్తే... 
అసలైన ప్రజాస్వామ్యం ఫరిడవిల్లి 
విశ్వదేశాలలో విజయ గీతికే ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment