మృగ వినోదం
తేది : 12-11-23
శీర్షిక : రాక్షసానందం
సహస్రాధికం
అల్ప ప్రాణులంటూ మృగజాతులను
స్వల్ప ప్రాధాన్యతలు చూపుతూ…
అంతంత మాత్రపు విజ్ఞానులంటూ
తృణీకరణల భావనలతో.. మనకు మనం
సమాధాన పరుచుకున్నా..
సంబరాల సమ ఉజ్జీలవడమే కాదు…
అధిగమించు అప్పుడప్పుడు అబ్బురముగ …
నిబ్బరాన నిండైన విధులకు
నీరాజనములిడుచూ నిజ జీవితమున …
సునామీల సమాలోచన సూచనలనైనా..
బావుల్లో బతుకు తీసేసుకునే గాసునైనా
వింతగా హంతకుల ఎరుకపరుచటలోనైనా..
చురుకులే మనకన్నా సుందరముగా…
సాటి మనుషులను సన్నుతించక
మేటిగా స్వార్థాలపై స్వారీ చేస్తూ
సందు దొరికిన చాలు నిందలు మోపి
బొందిలో ప్రాణములను బొమ్మగా ఆడిస్తూ ...
అది ఇదియను తేడాలు లేక
కంచే చేను మేసే వంచనలతో
తీరైన మోసాల తిరునాళ్ళుగా
లెక్కలేనన్ని టక్కు టమారాల చిరునామాగా…
పెక్కు మాయల ఉక్కు సంకల్పాలతో..
నిత్య మాయల మరాఠీలుగా
చెదలు నిండిన చెఱ బట్టే రాక్షసులుగా…
వింతరూపాల సంతతులైన లీలలెన్నో …
అన్నింటా మిన్నంటూ విర్రవీగే
మనిషితత్వమే... అదఃపాతాళానికి
అడ్డ దారులేర్పరుచుకుని రాక్షసానందాల
నిందాస్తుతులకు నీడగ నిలిచె ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment