Saturday, June 15, 2024

ముసుగు ముఖాలు తేది: 01-11-2023 శీర్షిక: పొంతనలేని వింత సంత.

 ముసుగు ముఖాలు 

తేది: 01-11-2023
శీర్షిక: పొంతనలేని వింత సంత. 

మార్వాడీకొట్టులో మాటవరుసకు 
మర్యాదల ఛాయ సత్కారంలా ... 
తీపి బెల్లాలు తినిపించే మాటలకు 
తీపులెక్కే పట్నపు బంధుత్వాలు ... 

 ఎదుటివారిని ఎత్తుకుంటూనే 
 లోలోన చిత్తుకు ఎత్తులు వేయడం ..
 భౌతికానికి అంతరాలోచనలకు 
 పొంతన లేని వింత పశువుల సంత ..

మునగచెట్టెక్కమని మురిపిస్తూనే
మెట్లులేని నిచ్చెన ముందుపెట్టడం… 
చక్కిలిగింతల హారం వేస్తూనే
బొక్కబోర్ల పడగొట్టే పథకంతో రెడీ… 

వైద్యో నారాయణ హరి అంటారు..కానీ
బి.సి మరియు ఏ. సిలా…కరోనా ముందు 
కరోనా తర్వాతంటూ….
రూకల మీద మనసు పారేసుకున్న కార్పొరేట్
వైద్యబృందం చికిత్సలను చింతచెట్టెక్కించి…

పాకేజి లాబు టెస్టులతో పజీతలు చేస్తూ
పనికొచ్చే.. పనికిరాని మందులతో
ఇంటెన్సివ్ కేర్ గదుల్లో వెంటిలేటర్
వాయనములిస్తూ… ప్రాణాలకన్నా
ఫాయిదాలకే ప్రాధాన్యమైంది సగభాగం…. 

ఇకనైనా విశ్వంలోనే పురాతమైన 
మన సంస్కృతిలో స్నానం చేయించి… 
సంప్రదాయంలోముంచి తీసి… 
మానవతా విలువల వలువలు తొడిగించి 
ఆత్మీయతల పరిమళాలు అద్దుదాం. 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment