Saturday, June 22, 2024

ధనుర్మాసం తేది 18-12-23 శీర్షిక : గోదాదేవి చెలులు.

 ధనుర్మాసం 

తేది 18-12-23
శీర్షిక :  గోదాదేవి చెలులు. 


రారండి చెలులారా
రంగనాదు కీర్తించగ
 గోపెమ్మలు పూజించిన 
 గోపాలుని అంశజుడే... 

 హేమంతం విరబూయగ
 సీమంతమె తుషారము 
 బిందువులు ముత్యములై 
 బింకమున మెరియంగా ... 

 గరిక పూల వనమంతా 
 గంభీరం తలలూపగ 
 ఆనంద పరవశముల 
 ఆహ్వానములంపంగా 

శుకపికముల కువకువలే
కిలకిలల భూపాళము
కోనేరున నీటిలోన 
స్నానమాడె చెలులంతాl

ముప్పది రోజుల వ్రతమును 
మరిపముగా చెల్లించగ
సిద్దపడిరి చెలులంతా 
రంగనాథుని కొలువంగా… 

రోజుకొక్క పాశురముతో 
రసరమ్యముగా కీర్తిస్తూ 
చెలలుంతా కోలాహలమే
చెంగల్వ పూదండలతో.. 

మార్గళిని పవిత్రమైన
మార్గముగా ఎన్నుకునిరి 
శ్రీహరియే శరణమని 
మానసమున నిలిపిరి… 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment