కవన రవళి
నానీలు
10-01-24
1.ఆయనం
మార్పుకు
అంకురం…
పుణ్యకాలాలకు
ఇదే ముహూర్తం…
2.ఆనంద భోగాల
ఆదిపర్వం…
సూర్యమానంలో
నిలిచిన సుందరం…
3.పాత అహాలను
అంటిస్తే…
అదేకద నిజమైన
భోగి పండుగ…
4.పాతరోతలకు
తలంటు స్నానాలు…
మార్పుకు శ్రీకారం
నూతన
వస్త్రాలు…
5.భోగిపండ్ల
ఆశీర్వచనాలు…
పిల్లలకవే
శ్రీరామరక్షలు…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment