బాల రాముని విగ్రహం
తేది : 22-01-2024
శీర్షిక : బాలా కుమారుడా
బాలా కుమారుడా
బంగారు దేవుడా ....
రావయ్యా కరుణించి
రఘువంశపు వీరుడా .....
సరయూ నది తీరమున
సౌమిత్రికి ప్రియములతో ....
కోసల దేశాధిపతి నీకు
కోటి కోటి ప్రణామములు .....
చిరునగవుల దరహాసం
చిన్ముద్రల దక్షిణ హస్తం…
విల్లంబులు చేకొన్న
వామహస్త భంగిమలతో ....
// బాలా//
అందమైన నీ రూపం
ఆనందమే మదిమదిన …
సుందరమౌ నీ గుణం
కోటి జన్మల పుణ్యఫలం ....
ఇనవంశపు ధీరుడా
ఇందీవర శ్యాముడా ....
కనులలోన కరుణ నింపి
కాపాడుము నీ ప్రజను ....
// బాలా //
ముగ్గురమ్మల ముద్దుబిడ్డ
మురిపాల తొలి బిడ్డ
మురిసెనే మనసంతా
ముల్లోకపు జగమంతా ....
ఆదర్శము నిన్ను చూస్తే
ఆత్మీయత నిర్వచనం....
అనురాగం నీ వెంటే
అన్నదమ్ములనుబంధం ....
// రావయ్యా //
గురువంటే భక్తి మెండు
గురుతరమై నడిచావు ....
రాక్షసులను చెరబట్టి
ధర్మాన్ని నిలిపావు....
ప్రజలంటే ప్రాణమని
తృణప్రాయమే భోగములు
సంపదలో తులతూగక
సదా ధర్మ చింతనలే ....
// బాలా //
త్రేతములో భూతముల
తెగనరికిన విజయుడవు ...
ఎందరో రాక్షసులను
మట్టుబెట్టి గెలిచావు ...
ఎందుకాయే ఆలస్యం
వందల వత్సరములు ....
కలిలో సైతం కాదనక మాకు
కైవల్యముల నొసగుమా .....
//బాలా //
నగునూరి రాజన్న
No comments:
Post a Comment