Saturday, June 22, 2024

ఏకాకి . తేది- 05-01-24 శీర్షిక : పట్టు విడుపులు

 ఏకాకి .

తేది- 05-01-24 
శీర్షిక : పట్టు విడుపులు

మనిషి సంఘజీవి … 
నలుగురితో కలిస్తేనే… 
నలుగురు మాట్లాడితేనే
నాగరికత ఒంటికి అద్దుకుంటేనే… 
నలుగురితో కలిసి బతకగలిగితేనే… 
మనిషి జన్మకు సార్ధకత… 

పశువుకు తింటే ధీమా 
మనిషికి ఉంటే ధీమా… 
అలా అని తినీ తినకుండా
అందరికి దూరంగా జరిగి… 
సంపాదనే ధ్యేయం కారాదు… 

మనిషికి స్వార్థం సర్వమైతే 
ఆ సర్వము లెక్కలేసుకుంటే 
చుట్టూరా మిగిలేది వట్టి బుర్రకాయే.. 
అందరు ఆమడల దూరమే... 

నలుగురితో నడవడమే… 
నలుగురిలో నలగడమే… 
ఆనలుగురిని సాధించుకోగలగడమే… 
అసలు మనిషి జీవనానికి మార్గదర్శకం… 

పట్టు విడుపుల పందేరమే… 
మనిషి విజయ రహస్యం… 
ఎక్కడ తగ్గాలో తెలిస్తే 
ఎక్కడైనా విజయ పరంపరలే… 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment