Sunday, June 16, 2024

సొరంగంలో -17 రోజులు తేది 30-11-2023 శీర్షిక : ఓడిన చోటే గెలుపు

 సొరంగంలో -17 రోజులు 

తేది 30-11-2023
శీర్షిక : ఓడిన చోటే గెలుపు 

సమున్నతమైన సంస్కృతిని 
సనాతనమైన సంప్రదాయాన్ని
సన్నుతించాలనే సద్భావనలు
సదుద్దేశాల సమ్మిళితం ... 

హిమాలయాల సానువులలో 
ఇరుకైన దారుల ఇక్కట్లను బాపి
అనువైన మార్గాల ఆధ్యాత్మికమై
 అందుకోనెంచిన కేదారనాథం… 

విలంబమెరుగని విధానాలతో 
 సొరంగమార్గమే శరణ్యమని 
 కదంబ పరచిన ప్రణాళికలను 
 ముదముగ అమలుపరచంగా ... 
 
పొంచిన పెనుప్రమాదము 
 ముంచెనే కూలి సొరంగం... 
 వంచన లేని ప్రయత్నాలెన్నో 
 మించి చేసిరి విశ్వవిఖ్యాతమై ... 

కనులముందే కరుగుతుంటే
అరచేత ప్రాణాలను ఉగ్గబట్టిన కార్మికులు…
అధికారగణం… కంటికి మంటికి
ఏకధారలైన కుటుంబాల బాధాతప్తం…

ఓడిన చోట గెలవాలనే తపనల
మంచి చెడులను ఎంచకుండా
మూలపడేసిన మూషిక రంద్రపు విధానాలను 
 ముదముగ స్వీకరించి మురిపించిరి… 
నలుబదొక్క కుటుంబాల ముఖములలో 
చిరునవ్వులు చిందించారు. 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment