Saturday, June 22, 2024

అదిగో ఆశలతీరం తేది 28-12-23 శీర్షిక : ఆహ్వానిద్దాం.

 అదిగో ఆశలతీరం 

తేది 28-12-23
శీర్షిక : ఆహ్వానిద్దాం.  

జ్ఞానం తెలియని వయసులో 
తెలియాటల ఉత్సవం… తెలిసిన 
దగ్గరనుండి తెలి మాయల ఆశల తోరణాలు.. 
ఆశయాల తీరాలు..ఆరాటాల పర్వాలు..
గమనపు దారులు గమ్యపు ప్రణాళికల 
ప్రవళ్లికలు… 

ఉన్నత చదువుల ఉడతా భక్తి 
 ఉద్యోగ బాధ్యతల ఊపిరి గంగ 
 సమాంతరమైన గృహస్థాశ్రమం 
 సవ్యంగా సాగిపోవాలనే తపనలు ...

కొన్నిసార్లు దారి తెలుసుకుని పరుగెత్తుతూనే 
మరికొన్నిసార్లు కాటగలిసిపోయి నీరసపడి
నిస్సత్తువలు ఆవరించుకుని నిదాన వాయిదాల 
పర్వాలను అక్కున చేర్చుకుని బద్దకాలతో 
బంధుత్వం కలుపుకున్నాం… 

ఎంత క్రమశిక్షణ ఆచారాలను అంటిపెట్టుకున్నా 
దీక్షా సంప్రదాయాలను చంకనేసుకున్నా 
పట్టుదలల సంస్కృతిలో తిష్టవేసుకున్నా … 
కొన్నిసార్లు…అదిగో ఆశల తీరమంటూ రేపటిపై 
ఊపులు ఆశలే అందరికి ... 

కాలగమనంలో మైలు రాయిలా 
అదృశ్య రేఖతో రేపటి నూతన సంవత్సరమై 
ఎదురుగ నిలిచింది ...ఆదరణలతో  
మనమూ మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం. 

No comments:

Post a Comment