కరపత్రం
తేది 28-12-23
శీర్షిక : పదం పొదుపు కదం తొక్కు.
చేతిలో ఇమిడిపోయే చెంగల్వ
పూదండ..
చెవిలో బాకా ఊది
చేర్చు సమాచారం...
చెంత
చేరి వింతగా చింతలన్నీ బాపు ...
చేరినంతనే మనసంతా ఆరాటాల ముల్లెగట్టు..
రంగుల హరివిల్లయి రమణీయతలు
పంచు నలుగురికి నవీనతలతో…
ఖర్చు తక్కువ ఖజానా ఎక్కువ
పదం పొదుపు కదం తొక్కు …
కరాకండీగా చెప్పదల్చుకున్న
గొప్ప విషయమంతా కుప్పపోసి
చుట్టుపక్కల వారందరితో
సూదంటుగా ముచ్చట
చెప్పడం...
కొనుగోళ్లు అమ్మకాలలో
కొన్ని
నమ్మకాలను ముల్లెగట్టి…అందించే
సేవలకు అందమైన
అలంకారాలు
జోడించి మాలగట్టి అందించేది...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment