Sunday, June 23, 2024

శ్రీపదాలు జనవరి 2024

 శ్రీపదాలు జనవరి 2024


శ్రీపదాలు🌷
1. పట్నం మింగేస్తున్న సరదాలు.
అచ్చమైన మానవీయ బంధుత్వాలు…
ఇచ్ఛమైన ఆత్మీయపు పల్లెపిలుపులు…
02-01-24

శ్రీపదాలు🌷
2.పల్లెలలో కనుమరుగైపోతున్న పొరుగుబంధాలు.
కల్తీలను కౌగలించుకోవడం వల్లనో…
కాలుష్యాలు కాటేస్తుండడం వల్లనో…
02-01-2024

శ్రీపదాలు🌷
3.గళం గమ్మత్తుగా రాగమెత్తుకుంది.
అవనిమాత ఆయనం మార్చుకున్నంతనే…
చలిపులి పంజా విసరగానే…
02-01-24

 శ్రీపదాలు🌷
1. పైపై మెరుగుల పటాటోపమే రాజ్యమేలుతున్నది.
ఈనాటి పెళ్ళితంతుల వింతల్లో …
ఎంతగా వద్దని కోరుకున్నా….
04-01-2024

శ్రీపదాలు🌷
2.పైపైమెరుగులే పెద్దన్నపాత్ర పోషిస్తున్నాయి.
పలుకుబడుల ప్రాబల్యం పొందడంలో…
పలురకాల సమస్యల పరిష్కారాలలో…
04-01-2024

శ్రీపదాలు🌷
3.పైపై మెరుగులే పట్టం కడుతున్నాయి.
ఈనాటి తాత్కాలిక విజయగాథల్లో…
అధమమని సుధాములెంత బోధించినా
04-01-2024

శ్రీపదాలు🌷
1.సంక్రాంతి మాసమంతా సంబరాలే.
సప్తవర్ణాల సోయగంతో ముగ్దమనోహరమై…
వాకిళ్ళలో వాలిపోయిన ముగ్గుబుట్టలతో…
08-01-2024

శ్రీపదాలు🌷
2.ధనుర్మాసమందు దండిపూజలు రంగనాథునకు.
మధురమైన పాశురములను పఠియిస్తూ…
రమ్యకీర్తనలు తిరుప్పావుగా పాడుతూ…
08-01-24

శ్రీపదాలు🌷
3.మందలకొద్దీ మాధ్యమాలు వచ్చాయి.
ఉత్పాదకతల్లేని ఉత్పాతాలకు మూలమౌతూ…
మత్తుమందులా యువతను ఆకర్షిస్తూ…
08-01-24

నేటి ఉత్తమ శ్రీపదకర్తలు
     తేదీ 08.01.2024
🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺

ముత్తుశ్రీ గారు
👏👏👏👏👏👏👏👏👏
శ్రీపదాలు
1 క్రిందపడిన పండును కడిగితింటాం..
రాలినపూవును దేవునికి సమర్పించం..
చెట్టూ, మట్టినుండేనని మరచిపోయామా?
03/01/2023
ముత్తుశ్రీ
💐💐💐💐💐💐💐💐💐

రామమోహన్ కటారి గారు
👏👏👏👏👏👏👏👏👏
శ్రీపదాలు
1. మనసు నిర్మలమైన సముద్రమవ్వాలి
బాధల బడబాగ్నులెన్ని రగులుతున్నా
గుండెలోతుల్లో ప్రకంపనలెన్ని సంభవించినా
08-01-2024
రామమోహన్ కటారి
💐💐💐💐💐💐💐💐💐

 నగునూరి రాజన్న గారు
👏👏👏👏👏👏👏👏👏
శ్రీపదాలు
3.మందలకొద్దీ మాధ్యమాలు వచ్చాయి.
ఉత్పాదకతల్లేని ఉత్పాతాలకు మూలమౌతూ…
మత్తుమందులా యువతను ఆకర్షిస్తూ…
08-01-24
నగునూరి రాజన్న
💐💐💐💐💐💐💐💐💐



 శ్రీపదాలు🌷
1.అనుభవాల సంపదలో మణిరత్నం
అతి సర్వత్రవర్జయేత్ నానుడి
అందరికి అన్నిచోట్లా అమలుచేయదగ్గది…
09-01-24

 శ్రీపదాలు🌷
2.ప్రతివిషయం సరిగమపదనిసల ప్రమోదపరిష్వంగమే.
గాలి వీచినా గమ్మత్తులే…..
మేఘం ఉరిమినా మురిపములే…
09-01-24

శ్రీపదాలు🌷
3.పట్నంచుట్టూరా పహారా కాస్తున్నాయి.
దుర్గంధపు కోటల దురహంకారం…
మనిషి అలసత్వపునీడల పడగలై…
09-01-24

శ్రీపదాలు🌷
1.నాయకులందరు ధరించేది ధవళవస్త్రాలే.
కండువాలతోనే వచ్చిన చిక్కంతా…
రంగులు మారితే రాజకీయమే…  
10-01-24

శ్రీపదాలు🌷
2.ఊరూవాడా ఉత్సాహాలతో సందడి.
ఏడురంగుల శింగిడే అంతటా…
యువతీయువకుల్లో హోళీపండగ ఆనందాలు…
10-01-24

శ్రీపదాలు🌷
3.రంగులే అసలైన హంగులు.
జీవితంలో చమక్కులు చేర్చుతూ….
బ్రతుకులో మెరుపులు పంచుతూ…
11-01-24

శ్రీపదాలు🌷
అతివాదం సాయుధమై పోరాడుదమన్నది
స్వాతంత్ర్యం సాధించాలన్న లక్ష్యంతో…
మితవాదము అహింస అంటుంటే…  
23-01-24

శ్రీపదాలు🌷
మనందరి మనోల్లాసాలకు ఊతము.
నవరసాల నాణ్యతలకు నమూనాలుగా…
వ్యంగములో భంగిమలయ్యే
రాజకీయాలు…. 
23-01-24

శ్రీపదాలు🌷
3. బుడిబుడి అడుగుల బాలరాముడు.
భువికి చేరెనదిగో చూడుడు..
కళ్ళల్లో మెరుపులతో కాంతిపుంజమై…
23-01-24. 

శ్రీపదాలు🌷
1.కాదా మదికొలను బ్రహ్మపుష్కరిణి.
సత్సంగములలో అప్పుడప్పుడు తచ్చాడితే…
ఆధ్యాత్మిక తరంగంలో ఓలలాడితే…
24-01-24

శ్రీపదాలు🌷
2. మదికొలనులో తరంగాలు మహాసున్నితం.
సంతసాల పద్మములు విచ్చుకోగా…
బాధల పత్రములు ముడుచుకోగా…
24-01-24

 శ్రీపదాలు🌷
3.మదికొలనులు సమానమని గుర్తించు.
మాటలలో కాఠిన్యం తూలకు…
చేతలలో కాలుష్యం చిమ్మకు….
25-01-24.
నగునూరి రాజన్న.

No comments:

Post a Comment