Saturday, June 22, 2024

పతంగి తేది 13-01-2024 శీర్షిక : రంగుల కలలా..

 పతంగి 

తేది 13-01-2024
శీర్షిక : రంగుల కలలా.. 
 
యువతరం కలలలా
అందమైన రంగులతో 
మనసుకు హత్తుకునే
మహత్యం నింపుకుంది… 

ఆయనం మార్పులో 
వాయనం ఇచ్చుకున్నట్టు… 
పైరగాలి రెపరెపలు 
పతంగులాటకు మద్దతు…. 

గాలి వాటానికి గమ్మత్తుగా
ఎగిరే రూపకల్పనలతో…
రకరకాల ఆకారాలతో 
ఆకాశం నిండిపోతుంది… 

సంక్రాంతికి క్రాంతిపథంలా 
సమున్నతమైన ఆటగా 
సంస్కృతిలో తీర్చిదిద్దె
సనాతనమై మన పెద్దలు… 

తమిళనాట నిషేధించినా 
గుజరాత్ లో పోషిస్తున్నారు 
జాతీయ గాలిపటం పండగ
పేరుతో హంగులతో ఆర్భాటాలతో… 

ఆటలతో పిల్లా పెద్దలకు 
ఆనందాలనే కాదు అప్పుడప్పుడు
ప్రమాదాలనుకూడా తోడు తెచ్చుకుని 
ప్రాణాలతో చెలగాటమాడుతుంది….
 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment