Sunday, June 23, 2024

శ్రీపదాలు డిసెంబర్ 2023

శ్రీపదాలు డిసెంబర్ 2023 

 శ్రీపదాలు🌷

1. సర్దుకుని బ్రతకడమే సగటుమనిషి.
వెగటుపుట్టించే వెర్రి విధానాలతో…
సనుగుడైనా వినిపించలేక సాగిలపడిపోతూ…
04-12-23

 శ్రీపదాలు🌷
2. వారెవ్వాలతో ఊరించే వాణిజ్యప్రకటనలు.
అదుపాజ్ఞలు లేని ముచ్చట్లతో…
పొదుపు వదిలే ఇక్కట్లతో…
04-12-23

 శ్రీపదాలు🌷
3. పొంతనలేని వింతపశువుల సంత.
చక్కిలిగింతల పూలహారం వేస్తూనే…
బొక్కబోర్లా పడగొట్టే ఆలోచనలతంటా…
04-12-23

శ్రీపదాలు 🌷
1.మార్పు లేకుంటే మనుగడేది?
కాలచక్రములో కవ్వమై తిప్పుతూ…
కడుపులు నింపును పంటలతో…
06-12-23

శ్రీపదాలు🌷
2. పొరుగున మార్పు ప్రస్పుటమీనాడు.
  కాల్పులవిరమణ ఉల్లంగనల లెక్కలానాడు..
కన్నెత్తి చూడటానికైనా భయమీనాడు…
06-12-23

 శ్రీపదాలు 🌷
3.మనిషి మనగలడు మహారాజులా .
మార్పును ఔపోషణ పడితేనే…
నవీనతల నాడిని అందిపుచ్చుకుంటేనే…
06-12-23

నాచిత్రం నా శ్రీపదాలు
శ్రీపదాలు 🌷
 1. అతివలకు అలంకారం వరం.
నఖశిఖపర్యంతం నందనమే వైవిధ్యముతో…
క్రీగంటచూపులతో  జేగంటలు మోగిస్తూ…
08-12-23

శ్రీపదాలు🌷
1. చిటారికొమ్మల్లో చిరునవ్వులపొట్లంలా అమిరింది.
భాషతెలియని భావకవిత్వం నింపుకుని…
రాగమెరగని శుకపికముల సంగీతంతో…
11-12-23
 (పిచ్చుక గూళ్ళు)

సవరణతో…
శ్రీపదాలు🌷
2.ఆశలు మదిలో అంకురమే.
ప్రేరణ పొందిన ప్రతీవిషయం
పెన్నిధిలా మనసున పెనవేసుకుంటే..
11-12-23

శ్రీపదాలు🌷
1.చిన్నచిన్న అనుభూతులే చిరుమందహాసాలు.
జీవనశోభల తోటలో కుసుమశ్రేణులు…
పరవశాలపందిరిలో వెదజల్లే పరిమళాలు…
13-12-23

శ్రీపదాలు🌷
2. అన్నీ ప్రియమైన అనుభూతులే.
 కళ్ళముందు కదిలిపోయిన చిత్రాలైనా…
కలలలో ఊహించుకునే సప్తవర్ణాలైనా…
13-12-23

పదాలు🌷
కమ్మనిఅనుభూతుల కలబోతలే జీవనసంగమం.
కనులకు పసందయ్యే పనోరమచిత్రాలతో…
వీనులకు విందయ్యే
వింతకమనీయతలతో…
13-12-23

నా చిత్రం నా శ్రీపదాలు. 🌷
1.సప్తవర్ణముల సరాగమై కురిసింది.
సంక్రాంతి సంబరాలకు సూచికగా…
అతివచేతుల్లో అమృతమై వర్షించగ…..
15-12-23

నా చిత్రం నా శ్రీపదాలు. 🌷
2.పల్లెతల్లి పరిమళించె పరవశమై.
వలసలన్ని ఆత్మీయతతో తిరుగుపయనమవగా…
సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటగా…
15-12-23

 నా చిత్రం నా శ్రీపదాలు. 🌷
3.తెలుగునాట శోభలతో సంక్రాంతితిరునాళ్ళు.
కళ్ళాపివాకిళ్ళలో కళాత్మకమైన రంగవళ్ళులతో…
హరిదాసులకీర్తనలు ఆనందాలు పంచగా…
15-12-23





🌿🌹 శ్రీపదాలు 🌹🌿
  🏵️ ప్రథమ విజేత 🏵️

శ్రీ  నగునూరి రాజన్న గారికి అభినందనలు
💐💐💐💐💐💐💐💐💐
శ్రీపదాలు🌷
1.చిన్నచిన్న అనుభూతులే చిరుమందహాసాలు.
జీవనశోభల తోటలో కుసుమశ్రేణులు…
పరవశాలపందిరిలో వెదజల్లే పరిమళాలు…
13-12-23
నగునూరి రాజన్న
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మనసు పొందే అనుభూతికి కొలమానాలు ఉండవు.  శిఖరాన్ని అధిరోహించి కొంతమంది ఆనందాన్ని అనుభవిస్తే,  కళ్ళతో చూసి అంతకు మించిన అనుభూతిని సొంతం చేసుకునేవాళ్ళు కొందరు. ప్రతిరోజు పండగే కానక్కర్లేదు. ప్రతి ప్రయత్నం గెలిపే కానక్కర్లేదు. పువ్వు పూసినా, కొమ్మఊగినా చినుకురాలినా, చూసి స్పందించే మనసుంటే చాలు పెదవులపై చిరునవ్వు మెరుస్తుంది. అలాంటి చిన్నచిన్న అనుభూతులే జీవితపు తోటలో పూలరాశులు. మనసును ఆహ్లాదపరిచే పరవశాల పరిమళాలు అంటూ.. అనుభూతులు అంశానికి గాను.. సున్నితమైన భావాన్ని అందమైన పదాలతో వ్యక్తీకరిస్తూ చక్కని శ్రీపదంగా వ్రాసిన నగునూరి రాజన్న గారు ఈవారం పోటీలో  ప్రథమ విజేతగా నిలిచారు. వారిని శ్రీ పదాలు సమూహం అభినందిస్తోంది..!

💐💐💐💐💐💐💐💐💐
👏👏👏👏👏👏👏👏👏
          సమీక్షకులు
      అనూశ్రీ గౌరోజు

శ్రీపదాలు🌷
1. ఆనందానికి అవధులు లేవు.
ముచ్చటైన మూడు సమూహాలలో …
ప్రథమవిజేతను నేనని అనగానే…
19-12-23

శ్రీపదాలు🌷
2.అప్పుడప్పుడు ఆలపించాలి అలకగీతం.
అనురాగపు తీగలు సవరించడానికి…
మౌనగీతాలు శృతి చేయడానికి…
19-12-23

శ్రీపదాలు🌷
3.ఊరడింపుల పర్వానికి ఊతము.
ఆలుమగల మధ్యన అంకురించే…
చిలిపి తగవుల ప్రారంభం…
19-12-23

నేటి ఉత్తమ శ్రీపదకర్తలు
     తేదీ 19.12.2023
🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺
నగునూరి రాజన్న గారు
శ్రీపదాలు
2.అప్పుడప్పుడు ఆలపించాలి అలకగీతం.
అనురాగపు తీగలు సవరించడానికి…
మౌనగీతాలు శృతి చేయడానికి…
19-12-23
నగునూరి రాజన్న
💐💐💐💐💐💐💐💐💐

ముత్తుశ్రీ గారు
శ్రీపదాలు
1.ఎప్పుడూ గుర్తుండే హక్కులు..
ఎప్పుడో గుర్తుకొచ్చే బాధ్యతలు..
అవకాశవాదానికి అసలురూపు మనిషే.
19/12/23
ముత్తుశ్రీ
💐💐💐💐💐💐💐💐💐
రామమోహన్ కటారి గారు
శ్రీపదాలు
2. చీకటికి హేమంతమంటే మక్కువ
వెలుగు త్వరగా కరిగిపోతుందని
తన ఆయుష్షు పెరుగుతుందని
19-12-2023
రామమోహన్ కటారి
💐💐💐💐💐💐💐💐💐

శ్రీపదాలు🌷
1. భగవద్గీత బహుగొప్ప కాంతిరేఖ.
జ్ఞానకాంతులను వెదజల్లగ వర్ధిల్లుతూ…
విశ్వవేదికలలో హిమశిఖరమై చాటుకుంటూ…
20-12-23

శ్రీపదాలు🌷
2.ఫలించదా శిశ్యుని పరిశ్రమ.
గురువులు కరుణించి ఆదరిస్తే..
పల్లమై జ్ఞానకాంతులు ప్రసరిస్తే…
20-12-23

శ్రీపదాలు🌷
3.మనిషికి మనోవికాసమై ప్రకాశించదా.
శరణాగతియే సర్వోత్కృష్టమని భావిస్తే…
ఘనీభవించని జ్ఞానకాంతులు ప్రసరితమైతే…
20-12-23

శ్రీపదాలు🌷
మసకదుప్పటి కప్పుకుంటున్నది అవనిమాత.
చలికాలంలో కలికాలం ఇముడ్చుకుని…
పల్చటిపొరల్లో భానున్ని కప్పివేస్తూ…
25.12.2023

 శ్రీపదాలు🌷
2.ప్రతిపక్షాలు మెచ్చిన అటల్జీ.
చిరుచిరు నగవుల చిన్మయుడు…
కవితా ఛలోక్తులు తన్మయుడు…
25.12.2023

శ్రీపదాలు🌷
1. పంచభూతాలు బహురూపాలనేది నిజం.
సప్తవర్ణశోభితమైన తీరొక్క కుసుమసంపదలతో…
షడ్రుచోపేతమైన అనేక ఫలసందోహాలతో….
26-12-23

 శ్రీపదాలు🌷
2.చిక్కనిభావనల చిలిపి గోదమ్మ.
సోపతులను గోపికలుగా భావించకోగా…
విల్లిపుత్తూరును రేపల్లెగా ఊహించుకుంటూ…
26-12-23

శ్రీపదాలు🌷
1. నాయకమాటలు తేనెపూతల తోటలు.
కాయలు  కాసినా లేకున్నా…
మకరందాల కుమ్మరింతలతో ఉక్కిరిబిక్కిరిచేస్తూ….
28-12-23

శ్రీపదాలు🌷
2.బాంకు బాలెన్సుల గల్లంతు.
సాంకేతికత కనుసన్నల్లో సడేమియాలు.
తేనెపూతల రాగాలతో గాలాలు…
28-12-23

 శ్రీపదాలు🌷
3.చిత్తమునకు దరహాసమే దర్పణమైనది.
చేతలఊడిగం చెప్పలేక అచేతనమౌతుంటే…
మాటలకోటలు తేనెలపూతలకు దుర్గములౌతుంటే…
28-12-23

పదాలు🌷
1. పట్నం మింగేస్తున్న సరదాలు.
అచ్చమైన మానవీయ బంధుత్వాలు…
ఇచ్ఛమైన ఆత్మీయపు పల్లెపిలుపులు…
02-01-24

 శ్రీపదాలు🌷
2.బాంకు బాలెన్సుల గల్లంతు.
సాంకేతికత కనుసన్నల్లో సడేమియాలు.
తేనెపూతల రాగాలతో గాలాలు…
28-12-23

శ్రీపదాలు🌷
3.చిత్తమునకు దరహాసమే దర్పణమైనది.
చేతలఊడిగం చెప్పలేక అచేతనమౌతుంటే…
మాటలకోటలు తేనెలపూతలకు దుర్గములౌతుంటే…
28-12-23

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment