Saturday, June 22, 2024

పిల్లికి చెలగాటం - ఎలుకకు ప్రాణ సంకటం తేది : 17-01-2024 శీర్షిక : సంఘర్షణ

 పిల్లికి చెలగాటం - ఎలుకకు ప్రాణ సంకటం 

తేది : 17-01-2024 
శీర్షిక : సంఘర్షణ 

అనుభవాల తోటలో 
అల్లుకున్న సంఘర్షణలు... 
చెట్టు మీద పుట్టమీద 
చేరుకున్న నానుడులు... 

నిష్టగా కష్టం చేసుకుంటే 
నియమంగా కడుపు 
నింపుకునే యోచన 
జనసామాన్యం ... 

కపటం నింపుకుని 
కల్లబొల్లి మాటలతో 
కలబడి గెలవాలన్నది 
కొంతమంది లక్ష్యం .... 

న్యాయానికి అన్యాయానికి 
ధర్మానికి అధర్మానికి 
నీతికి అవినీతికి 
నిత్యం జరిగే సత్యమిది .... 

అక్కడక్కడ అప్పుడప్పుడు 
పాలనావర్గాల మధ్యన 
పడి నలిగిపోయే మంత్రమేయలేని 
అధికార యంత్రాంగం ... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment