చిత్ర కవిత.
13-11-23
శీర్షిక : నిండైన సంస్కృతి
రణము ఘనముగ సాగుచుండగా
క్షణము మూర్ఛిల్లె మాధవుడు....
కణకణ నిప్పులు కురిపించుతూ
కదనరంగమున దూకెను సత్య ...
భీషణ వాక్కుల హుంకరించుతూ
భాషణములెన్నో చేసి భాసురమై
బాణములు వింటిని చేబూని
భగభగ నిప్పులు కురిపెంచెను భామ..
ధర్మరక్షణకు దండిగ నడుము బిగించి
దుష్టశిక్షణకు దురిత క్షయమునకు ...
దునుమాడగ వీరవనితయై
చెడుగుడులే ఇక అసురునకు ...
అసమంజసమైన అసురుని కోరికకు
అమ్మే జన్మించే అవతారిణిగా ...
అన్నీ తెలిసి ఆమాయక చక్రవర్తిగా
ఆటంతా నడిపించెను అచ్యుతుడు ...
చేటు ఎవరుచేసినా నీటుగా
శిక్షల
అమలు నిక్కచ్చిగా ఉంటుందంటూ
పరోక్ష సందేశం పరమావధిగా
పురాణాలలో నిబిడీకృతం ...
తగరాని పనులతో తలవంపులేనని
తనయునికైనా తగిన శాస్తిగా శిక్ష
విధించి… నిస్వార్థముగా నీతి బోధించి
నింపెకదా నీతికథగా నిండైన సంస్కృతి….
No comments:
Post a Comment