Saturday, June 22, 2024

యుగళ గీతాలు తేది : 20-01-2023 శీర్షిక : విన్నావా మావయ్యా

 యుగళ గీతాలు

తేది : 20-01-2023 
శీర్షిక : విన్నావా మావయ్యా 

ఆమె: 
విన్నావా మావయ్యా 
వింత జరిగె లోకాన 

అతడు: 
ఇంతకు వింతేమిటో   
కొంతైనా తెలుపరాదె...  

ఆమె: 
బంగారు కోవెలలో 
బాల రామ ప్రతిష్టంటా .... 
ఊరు వాడ ఒక్కటయ్యే 
రామనామ జపమయ్యే .... 

అతడు : 
అవునవును ..... 
ఇనవంశపు ధీరుడు 
ఇందీవరశ్యాముడు....  
అన్నదమ్ములన్నాడు 
అనురాగం పంచాడు .... 

ఆమె : 
యుగములెన్ని మారినా 
జగమున శ్రీ రాముడే .... 
ఒక్క మాట కోరగానే 
కానలకు పయనమయ్యే .... 

ఆమె : 
ప్రజలంటే ప్రాణమిచ్చే 
ప్రభువంటే అతడే సుమా....  
ఒక్కమాట ఒక్క బాణం 
ఒక్క సతియె ధర్మమనెను ... 

అతడు : 
మననమే పుణ్యమని 
మనసంతా నమ్మినాము. 
మనదెంత  అదృష్టమో 
ప్రతిష్టను వీక్షించగ .... 
 
ఆమె : 
వాకిళ్ళను ముగ్గులతో
వసారాలనూ దండలతో 
అలంకరించి ఆనందంగా
దీపాలను  వెలిగిద్దాము ..... 

అతడు : 
రామ నామ కీర్తనలతో 
వేద మంత్ర జపములతో 
మనము కూడ తరిద్దాము 
మరో లోకంలో విహరిద్దాం ... 

ఆమె: 
విన్నావా మావయ్యా 
వింత జరిగె లోకాన 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment