Sunday, June 16, 2024

ఒంటరి సమయాలు తేది: 20-11-2023 శీర్షిక : విజ్ఞాన వివేకాలు…

 ఒంటరి సమయాలు

తేది: 20-11-2023
శీర్షిక : విజ్ఞాన వివేకాలు… 

చేసుకున్నవారికి చేసుకున్నంతలా
వివేకమై విజ్ఞానాల బాటపట్టినా … 
విచక్షణలు మరిచి వింతపశువైనా 
అంతా మనచేతిలోని మాయనే ...

నడిచొచ్చిన దారిలోని ముళ్ళను 
పాపుకుని దైవత్వాల రాచబాటలను 
దొరకబుచ్చుకుని మంచిచెడులను 
ఎంచి నడుచుకోగలిగే దీపస్థంభం… 

 ఆంగ్ల నానుడి అచ్చు యంత్రంలా …
 ఒంటరి మేధావి తుంటరి ఆలోచనలు… 
దరిద్ర మెదళ్ళ దయ్యాల దుకాణాలై 
విచ్చుకత్తుల విషబీజాలు సంఘానికి. 

విత్తిన గింజలకొచ్చిన పంటచేలలా.. 
మానవతలకు జీవగంజిలా మారి 
మంచికి కంచెలా నిలబడినా ... 
కుండెడు తేనెలో నీటిచుక్క మాదిరి
చెదలు పీడలై చెట్టు భోజను చుట్టుముట్టినా..
మహత్యమంతా మన చేతిలోనే.. చేతలలోనే… 

అక్షయముగా మనల్ని మనం 
అంచనా వేసుకోగలిగి…గుణ దోషాల 
గుంభనపు పట్టికలో మార్పు చేర్పులను 
మలుచుకోగలిగే గొప్ప సదవకాశం ...

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment