Sunday, June 16, 2024

టెలివిజన్ 1014 తేది : 21-11-23 శీర్షిక : నాణేనికి మరోపక్క

 టెలివిజన్ 1014 

తేది : 21-11-23
శీర్షిక : నాణేనికి మరోపక్క

 దృశ్య సహితమైన దూరవాణి 
 ఉదాయాత్పూర్వమే ఏడుకొండలెక్కిన 
 ఆనందంతో మదిపులకింతలు 
 వారెవ్వా అనే గంటగంటకు వార్తలు ... 

నలుపు తెలుపుల్లోన  ప్రారంభమై
నయదునియాలో రంగుల శింగిడిలై
వార్తలకు వారసత్వం పుచ్చుకుని
తెరల టీవీగొచ్చి తెల్లగోడ ఎక్కింది… 

 పిల్లలకు ఆటాపాటల కొరకైనా 
 యువతకు వృత్తి నైపుణ్యలకైనా 
 పెద్దలకు ఆరోగ్యసూత్రాసులకైనా 
 సుద్దులు చెప్పే శ్రేయోభిలాషి ...

ప్రత్యక్ష ప్రసారాలతో పసందులే
ఆటల ప్రాంగణాలకు మనల్ని తీసుకెల్లినా 
రాకెట్ పయనాల అంతరిక్షంలోకైనా 
అలవోకగా లక్షల కోట్లమందికి 
నయనానందముల నజరానాలే ...

దూరదర్శనములతో ప్రారంభమైనా 
వివిధ ప్రవేటు చానల్లతో కూతవేటయ్యి 
రామాయణ భారతమ్ముల రసరమ్యతలను 
జనసామాన్యులకు చేర్చిన ఘనాపాటి… 

రకరకాల డిష్ టీవీలను దాటుకుని 
ఓ టి టిల వేదికలతో అలరారుతూ 
లెక్కలేనంత మంచితనం మూటకట్టుకున్నా 
సాగదీసే సీరియళ్ళతో సావచంపే పాత్రల
కథనంతో  ఒకింత అపఖ్యాతి మూటలే … 

నగునూరి రాజన్న 
కరినగరము. 

No comments:

Post a Comment