కవన రవళి 28-11-23 నానీలు…
ఏ పాపపు
కన్ను పడిందో…
మన అవిభాజ్యాలు
అంతరించాయి…
స్వార్థాల స్వారీతో
అహం దత్తతైతే
కుండ బద్దలై
కుంపటి వేరే….
ఆత్మీయతలు
ఎండిన చెరువుతై…
కప్పలన్నీ
బిక్కమొహాల వలసలే…
అనురాగాలు
తివిరిన ఇసుమైతే
పిచ్చుక గూళ్ళు
చెదిరి పోవా ?
బంధాలన్నీ
బాధలమయమైతే
ఆర్థికతలే
అగ్రభాగము.
నగునూరి రాజన్న
No comments:
Post a Comment