Saturday, June 22, 2024

టిఫిన్ బాక్స్ 31-12-23 శీర్షిక: సద్ది గిన్నె

 టిఫిన్ బాక్స్ 

31-12-23
శీర్షిక:  సద్ది గిన్నె

శానిగా టిఫిన్ బాక్సన్నా సరే
మోటుగా సద్ది గిన్న అని తెరిసినా
వద్దన్నా సద్దుమణిగేది మాత్రం 
మానవాళి ఆకలి మంటలు ... 

పంటపొలాల పనులలో
వెంటతెచ్చుకున్న సద్దిగిన్నె 
కాల క్రమేణా... పిల్లలతో బడికెల్లి చదువులు 
నేర్చుకుంటున్నది... పెద్దలతో 
పరిశ్రమలకు కార్యాలయాలకు వెళ్ళి
ఉత్పత్తులకు ఊతమౌతున్నది… 
అనేక సేవలకు సై అంటున్నది ….

పారిశ్రామిక ప్రగతి చక్రాన్ని పలకరించి I
విశ్వజగతిలో వింతగా పాలు పంచుకుంటూనే 
రంగులెన్నో మార్చుకుని రంగవల్లులు తీర్చి
దిద్దుకుని హాట్ పాక్ లని జ్యూట్ బ్యాగ్లని
అద్దాలపెట్టెల్లో రంగులీని హొయలు పోతున్నవి... 

డబ్బావాలాగా ప్రసిద్దికెక్కి ప్రపంచములోనే
 వినుతికెక్కి పరిశోధనలకు పత్రమై 
 పి హెచ్ డి లతో పట్టాలిస్తున్నది... 
బొంబాయిలో మొదలైన బోనం.  


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment