సంక్రాంతి
14-01-2024
శీర్షిక : నిండైన ఆనందాలు…
చంకలు కదిలించ లేనంత
గిలిగింతల చలి పలకరిస్తుంటే...
దక్షిణాయనం చివరి రోజును
ముగించుకుంటున్న
ముగించుకుంటున్న
దండిదొర నిండైన భాస్కరునకు
భోగిమంటలతో ఉత్తరాయణ
పుణ్యకాలానికి ఆహ్వానించడం ...
ఆవుపేడల కళ్ళాపి వాకిళ్ళలో
ఆకాశమంత చుక్కలముగ్గులతో
అతివలంత రంగవళ్ళలు తీర్చి
దిద్దంగ…పేడ గొబ్బెమ్మలతోడ
పేర్చిన అలంకరణలు…
బసవన్నల ఆటపాటలు…
హరిదాసుల సంకీర్తనలు
అంతా అంగరంగ వైభవములే
ఆనాటి సంక్రాంతుల ఆనవాళ్ళు…
పాడి పంటలు పుష్కలమున
ఇంట నిండిన ఆనందకీర్తనం…
పదుగురికి పంచి పల్లె పచ్చదనాలను
ఇనుమడింపజేసిన రైతన్న…
పిల్లలొస్తారన్న సంతోషములతో
తీరొక్క రకముగా తీపి కారముల
తీరిక లేని పిండి వంటలతో
అమ్మలంతా అలసిపోయినా…
అంతా హుష్ కాకే.
బడిబాటల సెలవులతో
బాలలంతా కూడి ఆడిపాడిరి.
చిట్టి చెళ్ళెల్లంత పట్టు పరికిణీలు
ధరించిన పుట్టెడు ఆనందాలు …
కోరి కొత్త అల్లుండ్లను ఆహ్వానించగ
కోడి పందెముల నిర్వహిణలు
కోలాటముల ఆనందించుతూ
కొండంత సందళ్ళను మూటగట్టుకునిరి…
రంగరంగుల పతంగులనెగురవేసి
హంగులు ఆర్భాటములు మూటగట్టుకుని
నిండైన ఆనందాల నిజ భరిణెలు
నింపుకునిరి…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment