కలిసొచ్చిన కాలం
తేది 16-11-23
శీర్షిక: కళ్ళల్లో తొణికిసలాడు సంతోషం ...
అనంతసాగర మధనంలో
ఆలోచనలు గింగిరాలై
ఆశలకు రూపకల్పనలై
ఆశయాలకు స్థానమేర్పడు...
గమ్యపు శిఖరాలను అధిరోహించాలంటే
గమనరీతులును దాటాల్సిందే…
సంకల్పాలను చంకనేసుకుని
దీక్షాదక్షతలను
ఒడిసి పట్టుకుని
తపోసంపన్నులమైతేనే ...
కలిసొచ్చే కాలం మనదైతే
నడిచొచ్చే ప్రతిఫలం కళ్లెదుటే …
కొంతమందికి మాత్రమే కొసిరి కొసిరి
వడ్డిస్తుంది కాలగమన స్థితులు ...
ఎవరికైనా ఎదురీదితే తప్ప
ఎదురుగ నిలువదు భోగం
దుమ్ము ధూళిలో కొట్టుకుపోయి
వాగువరదలో వలసబోతేనే ...
ఏదిఏమైనా పెల్లుబికే
ఆనందాల మూట
మాత్రం
పెట్టి పుడితే రాదు..
తేరగా వస్తే
తేలికభావమే..
కట్టి కొట్టి సాధిస్తేనే
కళ్ళల్లో తొణికిసలాడు సంతోషం ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment