గణతంత్ర దినోత్సవం
తేది : 26-01-2024
శీర్షిక : ప్రజా పండుగ
సాధించుకున్న స్వాతంత్ర్యానికి
కలుపుకున్న వందల సంస్థానాలకు
మార్గదర్శముగా నిలిచి సత్తా చాటాలని ,
సంబరంగా పలు వన్నెలద్ది...
సొగసులతో సూత్రీకరించుకున్న రోజు ...
రాజ్యాంగము శ్వాసగా ... ఊపిరిగా ....
సంస్కృతికి నిలువుటద్దంగా
సంప్రదాయానికి ప్రతిబింబంగా
రామాయణ మహాభారత
చిత్రాల సాక్షిగా వెలసిన రాజ్యాంగం ...
సకల జనుల సంగమం
కులమతాలకతీతంగా
కుత్చితాలకు దూరంగా
కులాసా కబుర్లతో ...
ఆనందాలను పంచుకునే
అతి ముఖ్యమైన పండగ ...
అనేకం అవపోశన పట్టి
లిఖితంగా ఏర్పరుచుకున్న
ప్రజా హక్కులు బాధ్యతలు
పవిత్రీకరించుకున్న సందర్భం ...
భిన్నత్వంలో ఏకత్వమని చాటి
విశ్వంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమై
విలసిల్లుతున్న దాఖలాలు ...
ప్రజా పండగగా జరుపుకునే రోజు ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment