Wednesday, June 12, 2024

జానపదం తేది 04-11-2023 శీర్షిక - నా రంగీ

 జానపదం 

తేది 04-11-2023
శీర్షిక - నా రంగీ

రంగు భళే తేలిందే 
రవ్వల నా రంగీ 
గువ్వలాగా ఒదిగిపోవే 
జవ్వనివై  ఎదపైనా ...

రవ్వంత పేమ జూపు 
రారాజుగా ఎలిగిపోతా 
అయ్యవ్వల ఆనతితో 
ఒక్కటయ్యి పోదాము ...

అడగమని పోరాడితే 
గుబులై పోతున్నదని...
కబుర్లే జెపుతున్నావ్ 
కాకమ్మ కథలలాగా ...

// పల్లవి//
రంగు భళే తేలిందే 
రవ్వల నా రంగీ 
గువ్వలాగా ఒదిగిపోవే 
జవ్వనివై  ఎదపైనా ...

అవ్వంటే బువ్వంటావు 
బువ్వంటే అవ్వంటావు 
అవ్వ బువ్వ కాదు గని 
ఆటో ఇటో తేల్చవే… 

రంగ ధాము తీర్థములో 
రవ్వల గాజులు తెస్తా… 
ఓదెల జాతరలోన 
ఓణీలు కొనిపెడతా ... 

॥పల్లవి॥
రంగు భళే తేలిందే 
రవ్వల నా రంగీ 
గువ్వలాగా ఒదిగిపోవే 
జవ్వనివై  ఎదపైనా ...

అప్పుసప్పు జేసయినా 
గుడిసె నిలుపుకుందాము
కాయకష్టం నమ్ముకుని 
గొప్పంగ బతుకుదాము… 

అమ్మ తోడు నమ్మవే 
నిన్నొదులా జీవితాంతం… 
పిల్లాజెల్లలయినాక  
మర్యాదలు జేత్తారు… 

॥పల్లవి॥
రంగు భళే తేలిందే 
రవ్వల నా రంగీ 
గువ్వలాగా ఒదిగిపోవే 
జవ్వనివై  ఎదపైనా ...


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment