Saturday, June 22, 2024

ముహూర్తం తేది- 05-01-2024 శీర్షిక- సరైన సంకల్పం…

 ముహూర్తం 

తేది- 05-01-2024
శీర్షిక- సరైన సంకల్పం… 

 కదిలిపోయే కాలమన్నా 
 జరిగిపోయే జీవితమన్నా 
 కష్ట నష్టాలు..సుఖ దుఃఖాలు.. 
 నిండుతూ ఖాళీ అయే కావడి కుండలే ... 

 ప్రకృతి పరమైన జనన 
 మరణాలకు లేనిది... 
 పట్టింపులతో పాటించుకునే
 శుభాల సుందర  సమయాలు ...

సంస్కృతికి చిరునామాగా
ఆచారాలకు అనుగుణంగా
సాంప్రదాయాలకు సన్నుతింపుగా 
అనుభవాల సంపదగా పాటించేది… 

వారం వర్జ్యం సుముహూర్తం 
వరసబెట్టి చూసుకుంటారు… 
నలుగురిని పిలిచి నందనంలా 
ఆచరించి ఆనందాలను ద్విగుణీకృతం
చేసురృకుంటారు…పనుల్లో తలో చేయి వేసి
తన్మయత్వం పొందుతారు… . 

ఏది ఏమైనా సంకల్పం సరైనదైతే 
చేసేపనిలో న్యాయం ధర్మం నిండితే
కాలమేదైనా కలుగు బలం… 
స్థానమేదైనా సర్దుకును బంధం… 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment