Saturday, June 15, 2024

పత్రికలు-విజ్ఞానం-వినోదం తేది : 16-11-23 శీర్షిక : విజ్ఞాన భాండాగారం.

 పత్రికలు-విజ్ఞానం-వినోదం

తేది : 16-11-23
శీర్షిక : విజ్ఞాన భాండాగారం.

పదహారవ శతాబ్దం నుండే 
పయనమాయె వ్రాతప్రతులుగా 
పలురకాలుగా ఫరిడవిల్లి విశ్వాన
పంచుతున్నవి విజ్ఞాన వీచికలు..

ప్రజాస్వామ్య పాలనలకు పట్టుగొమ్మలై  
ప్రజల గొంతుకగా ప్రతిధ్వనిస్తూ 
ప్రశ్నలను సంధిస్తూ ఎప్పటికప్పుడు
పట్టాలు తప్పకుండా పాటుపడుతుంటాయి ... 

నిత్యం పలకరించే దినపత్రికలు 
వారం వారం ముచ్చటించే  వారపత్రికలు 
మాసానికో చుట్టమయ్యే మాసపత్రికలు 
మహిళలకు మాత్రమే ప్రత్యేకం మహిళాపత్రికలు…
అన్నీ ఆ హంసవాహిణి మానసపుత్రికలే… 

చదువు సంధ్యల జాడలతో 
 ఉద్యోగావకాశాల సుద్దులతో 
 మానసికోల్లాస కథలతో 
 పదవినోదాల పందిళ్ళతో ... 

 పెళ్లి పేరంటాలకు పెద్దమనిషిగా 
 న్యాయసలహాల సంప్రదింపులకు 
 ఆరోగ్య రక్షణ సిద్దులకు 
 ఆహార్యాల అందాలకు... 
 అది ఇది అను తేడా లేకా అన్నింటిని 
మోసుకొచ్చే విజ్ఞాన భాండాగారం.

చీకటి వెలుగుల సంధికాలంలా 
ఓ వెలుగు వెలిగిన పత్రికలు... 
పూటపూటకు పూరించిన శంఖంలా
దృశ్య శ్రవణపు దూరవాణిలతో 
గంటగంటకు నవీకరణలతో
నెట్టు ప్రపంచంలో పిట్టగోడలా 
అరచేతిలో అస్త్రమైన చరవాణిలతో 
కొంత కష్టకాలాల నిష్టూరమే...నేడు… 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment