విద్యుత్తు
తేది : 20-01-2024శీర్షిక : జ్యోతి కిరణాలు.
నాగరికతల దారులలో
నడక నేర్చిన గడసరి ...
ప్రగతి చక్రాన్ని ఒంటరిగా
పట్టుకు మోస్తున్న సొగసరి ....
అత్యవసరాలకు ఆలంబనగా
అవసరాలను కనిపెట్టుకుంటూ
విలాసాలకు కులాసాగా అండై
వింత వింత పాత్రలు పోషిస్తూ ...
గుడ్డి దీపాల నడ్డివిరిచి
జ్యోతి కిరణాలతో
వెలుగు రేఖలు విరజిమ్మి
విజయ బావుటా ఎగరేసింది ...
నల్ల వజ్రం మూలమైంది
నగారా మోగించగా ....
ఎల్ల ప్రపంచానికి పెద్ద దిక్కు
తల్లి గర్భం నుండి వల్లకాటివరకు ....
ఇంక్యూబేటర్ల రూపమైనా ...
వెంటిలేటర్ల శ్వాసలైనా ....
ప్రాణవాయువులందించగా ....
దహన భస్మీకరణలకైనా ....
ఇక మనమే వివేక విచక్షణలతో
పుణ్యమూర్తులైన పునరుత్పాదక
శక్తులవైపో ...సంప్రదాయేతర
వనరుల వైపో ....అడుగులేయాలి ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment