Saturday, June 15, 2024

దర్పణం బాలల దినోత్సవం. 15-11-2023 శీర్షిక : కానుకిద్దాం

దర్పణం బాలల దినోత్సవం.
15-11-2023
శీర్షిక : కానుకిద్దాం 


పేరుకొక రోజు పెన్నిధిగా తగిలించి 
 ఊరికొరీతిగా వెట్టిచాకిరీల ముంచడమా ?
 పంటచేలుకు చీడల బారి రక్షణలా 
 ఇంట బాల్యానికి అమ్మానాన్నలే కాదు 
 ఇరుగు పొరుగులు అధికారగణం పాలకగణం 
 అందరు కలిస్తేనే అది సాధ్యం ....

బంగారు బాల్యం ఆదేవుడి వరం 
అందరం వారసత్వమై పొందినదే 
అందిద్దాము ఆదరంగా చేయూతా 
నేటి బాలలే రేపటి పౌరులు ...

చదువులో నిత్య పోటీలే నిలుపు శ్వాసలని 
కొలుపుల పూజలు చేయిస్తూ..జీవిత్తమంటే 
మార్కులేనని…తీపిలేని చెరుకుగడలను 
తిప్పలుపడి పిండి పిప్పిచేస్తూ ఆత్మీయతల 
ఆనవాళ్లను అనురాగాల సుధలను దూరం 
చేయొద్దు… 

బాలలనెత్తుకెళ్లి బంధించడం 
అంగవైకల్యాల కానుకలిచ్చి 
అడుక్కునేవారిగా చేసి .. ఆపై 
ముఠాలేర్పడి జట్లుకట్టడం... 
సాంకేతికయుగంలో సిగ్గుపడే విషయాలు ...

ఈనాటి లంచగొండితనం 
అధికార దుర్వినియోగమంతా 
వారికి చెందాల్సిన వాటాల న్యాయ భాగం 
వారి హక్కులను కాలరాయొద్దు ...

చట్టాలకింకా పదును పెడితేనే 
ఇనుప చువ్వలను ఇంకా కాలిస్తేనే… 
వంకరబుద్దుల పెద్దోళ్ళంతా… వారసత్వమై
ఆనందించిన బాల్యపు ఆనవాళ్ళను 

బంగారుపల్లెంలో వారికి చేర్చుతారు…. 

No comments:

Post a Comment