Saturday, June 22, 2024

ఆత్మ సంతృప్తి తేది : 23-01-2024 శీర్షిక : కొలత లేనిది…

  ఆత్మ సంతృప్తి

తేది : 23-01-2024
శీర్షిక : కొలత లేనిది… 

పశువుకు తింటే తృప్తి 
మనిషికి ఉంటే తృప్తి 
మనిషి మనిషికి మారిపోయేది ...  
ఏ కొలతలకంటూ అందనిది .... 
ఒకప్పుడు కోకోల్లలైతే...ఇపుడు 
అంజనమేసినా కానరానిది .... 

అవని మాతపై పచ్చ తివాచీలు 
పరిచి ...దేశం సుభిక్షమైతేనే ....  
పదిమందికి కడుపులు నింపితేనే  
గాని మనసు నిండని రైతన్న  .... 

ఇరుగు దృష్టి పొరుగు దృష్టి 
దోషాలను సవరిస్తూ ... దేశం 
సంక్షేమపథంలో పయనిస్తేనే 
కంటినిండా కునుకు సైనికునికి .... 

నాడు పల్లెల్లో చల్లగాలికి 
పెరిగితే దొరికిన సంతృప్తి ... 
ఇపుడు పరుగుల పట్నంలో...  
ఆనవాలు లేని ఆత్మ సంతృప్తి ... 
ఎదో బతికేయాలి అన్న 
ఆరాటాల పోరాటాలే తప్ప .... 

బరువెంచని తరువులా 
పంచ భూతాల వలె పట్టం 
కట్టుకుంటేనే ... పదిమంది క్షేమం 
కోరడంలోనే అసలైన సంతృప్తి ... 
పల్లేరు గాయల్లా ఇతరులను 
ఓర్వలేనితనాలతో పిప్పి చేయడమైతే 
పుడితే ఏమి గిడితే ఏమి ....  

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment