ఒక ఆదివారం
తేది : 01-12-2023
శీర్షిక : కాలాన్ని కరగదీసే కర్పూరం…
వారపు చుట్టమా వందనం నీకిదే
వారిజాక్షిలా వచ్చి పలకరిస్తావు..
మరు మల్లెల పరిమళాలు నింపి
చిరు చామంతుల ఆనందాలను తీసుకొస్తావు ...
ఎదురుచూపులలోనే ఆహ్లాదం..
ఏమిచ్చినా ఎంతిచ్చినా సంతోషమే...
వారమంతా నిరీక్షిస్తే కాని దొరకవు..
వారధిలా నిలిచి ఉత్సాహాలు నింపి వెళ్తావు …
బద్దకాలను దులిపి నిద్దుర లేపుతావు
ముగింపు పలకాల్సిన పనులను ముందుంచి…
కాలమంతా కర్పూరంలా కరగదీస్తావు
కంటిమీద కునుకులేకుండా చేస్తావు…
కట్టుకున్న ఇల్లాలుతో కనిపెంచిన పిల్లలతో
చిరు చిరు సంతోషాలను మూటగట్టి
మరోవారము పనుల్లో లీనమవడానికి
సహనశీలతల స్థిరత్వాలను సమకూరుస్తావు…
వేర్వేరు సంప్రదాయాలను వేలు పట్టి నడిపినా..
ఉన్నతమైన హైందవ సంప్రదాయపు
ఉనికిని పతనము చేయ దలిచిన తెల్లోడి
తెలివికి తలలూపిన ఆచార సంప్రదాయాలు…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment