అభయమీయవే... త్రిలోకమాతా...
వేడెదనిన్నే మనసారా ...
విజయములీయవే... దుర్గాంబా...
వేడెదనిన్నే మనసారా....
౹౹అభయమీయవే౹౹
శుభదాయని వరదాయని
కాత్యాయని నీవే
ఆదిశక్తి
పరాశక్తి జగదాంబవు నీవే
జయభేరిని మ్రోగించే హారతులివిగో
కరుణించి దీవించే శాంభవి నీవే
౹౹అభయమీయవే౹౹
ఈశ్వరి,జగదీశ్వరి రాజేశ్వరి నీవే
దాక్షాయిని,
భద్రకాళి,అన్నపూర్ ణవు నీవే
సహస్రనామ పారాయణ ,అర్చనలివిగో
లోకాలను కాచే అమ్మలగన్న అమ్మవునీవే
౹౹అభయమీయవే౹౹
శ్రీలలితా శివజ్యోతి సింహవాహిని నీవే
జగజ్జనని, చండీ త్రిపురసుందరి నీవే
నవరాత్రుల శుభరాత్రుల గాయత్రివి నీవే
మము బ్రోచే వాసవాంబవు నీవే
అభయమీయవే త్రిలోకమాతా
వేడెదనిన్నే మనసారా
విజయములీయవే
దుర్గాంబా వేడెదనిన్నే మనసారా
*డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి*
అనకాపల్లి
No comments:
Post a Comment