అంతులేని వ్యధలు
తేది: 27-10-2023
శీర్షిక : మానవ సృష్టే…
హనుమంతుని తోకలా అంతంలేని
వింత వ్యధలు నిండిన జీవితాలు…
కొంతలో కొంతయినా తీరునేమో
స్వార్థాలను చంకదించితే రాజకీయాలు…
మనుషులలో మర్మం దాగినన్ని రోజులు
పక్కవారిని కర్మం పలకరించడం వదలదు...
విజ్ఞానాలు నిండిన వింత జీవులం
పక్కవారినేం ఖర్మ వికృతంగా
విస్తరించి ప్రకృతినే గావు పడుతున్నం…
ఒకడు జీవితాంతం కష్టించినా
గుప్పెడు మెతుకులు గొంతుక దిగవు...
మరోకడు కాలుమీద కాలు వేసుకున్నా
దరిద్రం దరిదాపున కూడా చేరదు..
దండి ధర్మ సూత్రాలు నిండిన రాజ్యాంగం
గంతలతో న్యాయ వచనాలు నిండిన చట్టాలు
వింతగ నీతి వాక్యాలనుటంకించే పాలకులు
నిజాయితీ నినాదాలతో గోడలు నింపే అధికారగణం..
అందరు నామాల శాఖాహరులే..
అయినా మాయమైన కుక్కుటంలా…
డైమండ్ జుబిలీలైనా…శత వసంతాలైనా
దరి చేరని సంపదలు.. తెరతీయని పాలనలు…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment